12వతరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ గుడ్ న్యూస్

by Shamantha N |   ( Updated:2021-06-17 01:44:28.0  )
12వతరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా పరీక్షలు ఆగి పోయాయి. ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో ఆగిపోయిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సీబీఎస్ఈ పరీక్షల నిర్హహణపై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పరీక్షలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసుల విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో 12 వ తరగతి ఫలితాలను ఏవిధంగా ప్రకటించాలి అనేదానిపై సీబీఎస్ఈ మార్కుల ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. పది, పదకొండు, పన్నెండో తరగతులలో వచ్చిన మార్కుల ఆధారంగా పన్నెండోవ తరగతి తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

ఈ ఫలితాల కోసం 30+30+40 ఫార్ములను అనుసరించాలని సీబీఐ నిర్ణయించింది. విద్యార్థుల ప్రతిభనుబట్టి 10వ తరగతిలో విద్యార్థుల ప్రతిభకు 30 శాతం, 11వ తరగతిలో విద్యార్థుల ప్రతిభకు 30 శాతం, 12 వ తరగతిలో విద్యార్థుల ప్రతిభకు 40 శాతం మార్కులు ఇవ్వనున్నారు. సీబీఎస్ఈ మార్కుల ప్రణాలికకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. దాంతో జూలై 30 లోపు సీబీఎస్ఈ పరీక్షఫలితాలు విడుదల చేస్తామని చెప్పింది. అలాగే పరీక్షరాయాలి అనుకునే విద్యార్థులకు కూడా సీబీఎస్ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story