- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీని కాపాడుకోవడమే అమరజీవికి నివాళి: చంద్రబాబు
అరాచక శక్తుల విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడమే అమరజీవి పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనను జ్ఞప్తికి తెచ్చుకున్న చంద్రబాబునాయుడు రెండు ట్వీట్లలో ఆయనను గుర్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌పై సీఎం ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ పిలుపునివ్వడం విశేషం.
‘తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారు. ఒకవైపు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూనే, మరోవైపు నిమ్నవర్గాల హక్కుల కోసం పోరాడి దళితులకు ఆలయ ప్రవేశం కలిగించిన సంఘసంస్కర్త శ్రీరాములుగారు’ అంటూ తొలి ట్వీట్‌లో పేర్కొన్న చంద్రబాబు, మలి ట్వీట్‌లో…
‘ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనం. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉద్యమానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం కావాలి. అరాచకశక్తుల విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడమే ఆ అమరజీవికి నిజమైన నివాళి’ అంటూ పిలుపునిచ్చారు.