- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్ కేసు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐ ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫోరెన్సిక్ నిపుణుల సహా 10 మంది సభ్యుల సీబీఐ బృందం గురువారం ముంబయి చేరుకుంది. వీరికి క్వారంటైన్ మినహాయిస్తున్నట్టు మహారాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. గురువారం దర్యాప్తు ప్రారంభించిని సీబీఐ రాజ్‌పుత్ కుక్‌ను డీఆర్‌డీవో, ఐఏఎఫ్ గెస్ట్‌హౌజ్‌కు తీసుకెళ్లి ఇంటరాగేట్ చేశారు.
కేసుతో సంబంధమున్న వ్యక్తుల వాంగ్మూలాలను తీసుకోవడంతోపాటు రాజ్‌పుత్ ఆర్థిక లావాదేవీలపైనా సీబీఐ ఆరా తీయనుంది. మరో సీబీఐ బృందం బాంద్రా పోలీసు స్టేషన్ చేరుకుని అక్కడ నమోదైన యాక్సిడెంట్ డెత్ రిపోర్ట్, ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టు సహా పలు ఆధారాలను తీసుకుంది. కాగా, సీబీఐతోపాటు ముంబయి పోలీసులూ దర్యాప్తును కొనసాగించబోతున్నట్టు వెల్లడించారు. తమ దర్యాప్తులో లోపాలు కనిపిస్తే సీబీఐ బదిలీచేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపినట్టు పేర్కొన్న ప్రభుత్వ అధికారి తెలిపారు.