ఆ ఐఏఎస్‌ అధికారికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌..

by srinivas |   ( Updated:2021-09-23 10:43:03.0  )
ias
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ విచారణకు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఈ నెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు సీఎం జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి.

వాన్‌పిక్‌ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, పెన్నా కేసులో విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి గురువారం విచారణకు హాజరు కాలేదు. ఈ సందర్భంగా న్యాయవాదుల గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు తప్పనిసరిగా హాజరుకావాలి.. లేని పక్షంలో తగిన ఉత్తర్వులిస్తామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed