ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు

by srinivas |
AB Venkateswara Rao
X

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకుని చంద్రబాబునాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విధినిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇదే వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించిన విషయం తెలిసిందే. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్టు తేలటంతో సస్పెండ్‌ చేసినట్టు జీవో నంబర్‌ 18లో స్పష్టం చేసింది. పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్స్‌ విధానాలను కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్టు ప్రభుత్వం గుర్తించింది.

Tags: Cat dismissed, AB Venkateswara Rao, petition, ycp govt, chandrababu, former Chief of Intelligence

Next Story

Most Viewed