- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయిలకు కాస్టింగ్ కౌచ్.. మరి అబ్బాయిలు సినిమాల్లోకి రావాలంటే..?
దిశ, వెబ్‌డెస్క్ : సినిమా అనేది రంగుల ప్రపంచమనేది తెలిసిన విషయమే. మరి దాంట్లో అడుగు పెట్టాలంటే అంత తెలిక కాదు. ఒక్క ఛాన్స్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తారు. సినీ స్టూడియోలు, హీరోలు, దర్శక నిర్మాతలు ఇంటి గేట్ల ముందు రోజుల తరబడి ఎదురు చూస్తుంటారు. అయినా ఛాన్స్ వస్తుందనే నమ్మకం లేదు. వెండి తెరపై వెలిగాలంటే కాస్టింగ్ కౌచ్ ఒప్పుకోవాలని అమ్మాయిలను డిమాండ్ కూడా చేస్తారు. మరి అబ్బాయిలు ఏం చేయాలి. వారికి వేషాలు ఎలా రావాలి. టాలెంట్ ఒక్కటే ఉంటే సినిమా అవకాశం ఇస్తారా…? ఓ యువకుడు సినిమా వేషం కోసం మరణం అంచుకు వెళ్లొచ్చాడు. సోదరుడు చెప్పిన సలహా పాటించి జైలు పాలయ్యాడు.
తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో మారిముత్తు ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన స్వగ్రామం కాంచీపురం జిల్లా సుంగువాసత్రం మండలం సంతవేలూరు. ఆయన తమ్ముడు చెన్నైలో ఉంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తమ్ముడిని చూసిన మారిముత్తుకు కూడా సినిమాల్లో నటించాలని కోరిక కలిగింది. ఇదే విషయాన్ని తన సోదరుడికి చెప్పి సినిమా అవకాశాలు వచ్చే మార్గం చెప్పాలని కోరాడు. ఓ కంత్రీ ప్లాన్ చెప్పి తమ్ముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆఫీస్ నుంచి వచ్చిన మారిముత్తు.. ఇంట్లోకి వెళ్లి గొంతు కోసుకున్నాడు. ఆ ఘటనను లైవ్ వీడియో తీసి తమ్ముడికి పంపించాడు. ప్లాన్ ప్రకారం.. ‘సినిమాల్లో అవకాశాలు రాక యువకుడు ఆత్మహత్యహత్నం’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. అయితే ఇవేమి తెలియని స్థానికులు మారిముత్తు ఇంట్లోకి వెళ్లి రావడం లేదని పోలీసులుకు సమాచారం ఇచ్చారు. వాళ్ల వచ్చి తలుపులను బద్దలు కొట్టి అతడిని ఆస్పత్రికి తరలించారు. విచారణలో మొదట పొంతన లేని సమాధానాలు చెప్పిన మారిముత్తు.. ఆ తర్వాత సినిమా ఎంట్రీ గురించి చెప్పడంతో షాక్ తిన్నారు. మారిముత్తును ఆయన సోదరుడిని అరెస్ట్ చేశారు.