ఏటీఎం సెంటర్లలో భారీగా నగదు గోల్‌మాల్

by Anukaran |
ఏటీఎం సెంటర్లలో భారీగా నగదు గోల్‌మాల్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పలు ఏటీఎం సెంటర్లలో క్యాష్ డిపాజిట్లలో గోల్‌మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. రూ.1.23కోట్లు పక్కదారి పట్టినట్లు సమాచారం. క్యాష్ డిపాజిట్ చేసే సిబ్బందే డబ్బును పక్కదారి పట్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాష్ మేనేజ్ మెంట్, క్యాష్ రిప్లేస్‌మెంట్ సర్వీస్ చేస్తోన్న సికింద్రాబాద్ సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. బీటీఐ పేమెంట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది.

ఆడిటింగ్‌లో భారీగా నగదు గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది వ్యాల్యూ ఇండియా సంస్థ. బీటీఐ ఉద్యోగులు రాజశేఖర్, రమాభరత్, సాయితేజ, అశ్విన్ క్యాష్ గోల్‌మాల్‌కు పాల్పడినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed