లాక్‌డౌన్ ఉల్లంఘించిన 18 మంది ప్రజాప్రతినిధులపై కేసులు

by Shyam |

దిశ, నిజామాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా బోధన్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులు, పలువురు కౌన్సిలర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌లో మహనీయుల జయంతి వేడుకలు ఇండ్ల వద్ద నిర్వహించుకోవాలి అని ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. అయినా, మంగళవారం బోధన్ పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహించిన ప్రజా ప్రతినిధులపై పోలీసుల కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించారని మున్సిపల్ ఛైర్మన్ పద్మ శరత్ దంపతులతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య తదితరులపై కేసులు నమోదు చేశారు.

Tags: Cases against, public representatives, violating lockdown, bodhan, nizamabad

Advertisement
Next Story

Most Viewed