- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సాయి ధరమ్ తేజ్ మీద కేసు నమోదు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన విషయంలో యాక్సిడెంట్ కు గురి అయిన సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదైంది. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆయనను 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉండగా.. బైక్ రాష్ డ్రైవింగ్ చేసినందున ఐపీసీ సెక్షన్ 336 మరియు 184 సెక్షన్ల కింద తేజ్‌పై కేసు నమోదయ్యింది. రాయదుర్గం పోలీసులు తేజ్‌పై కేసు నమోదు చేసి అతని బైక్‌ని కస్టడీలోకి తీసుకున్నారని సమాచారం.
Next Story