ఆలియా భట్‌పై కేసు

by Shyam |
ఆలియా భట్‌పై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘గంగుబాయి కథియావాడి’. ఆలియా భట్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకులు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది. మూవీ స్టోరీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డైరెక్టర్‌తో పాటు ఆలియాపై ముంబై సివిల్ కోర్టులో కేసు వేశారు గంగుబాయి ఫ్యామిలీ మెంబర్స్.

వారితో పాటు ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తక రచయిత హుస్సేన్ జైది కూడా కేసు వేశారు. ‘గంగుబాయి కథియావాడి’ చిత్రం ఈ పుస్తకం ఆధారంగానే తెరకెక్కుతుండగా..ఈ సినిమాలో ఆలియా వ్యభిచార గృహ యజమానిగా, మాఫియా క్వీన్‌గా కనిపించబోతుంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజై విమర్శకుల ప్రశంసలు కూడా పొందగా..సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed