మగ బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని కాబోయే భార్య

by vinod kumar |
మగ బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని కాబోయే భార్య
X

లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుంచి బయట పడిన తర్వాత శుభవార్త అందుకున్నారు. ఆయన కాబోయే భార్య, సహచరి క్యారీ సిమండ్స్ బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల క్రితం బోరీస్ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినప్పుడే క్యారీలో కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. అప్పుడు నిండు గర్భిణిగా ఉన్న క్యారీ తగు జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనా ముప్పు తప్పింది. కాగా, ఇవాళ లండన్ లోని ఒక ఆసుపత్రిలో క్యారీ మగబిడ్డను ప్రసవించింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. గ ఏడాది జులైలో బోరిస్ ప్రధాని అయినప్పటి నుంచి క్యారీ ఆయనతో పాటే ఉంటోంది. ఫిబ్రవరిలోనే తాము బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. కాగా, బోరిస్ జాన్సన్‌కు ఇదివరకే మరీన వీలర్‌లో పెండ్లైంది. వారికి నలుగురు సంతానం. అయితే వీళ్లు 2018 సెప్టెంబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలోనే వారికి విడాకులు మంజూరయ్యాయి.

Tags : Boris Johnson, Carrie Symonds, Baby Boy, Prime Minister

Advertisement

Next Story

Most Viewed