పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే ?

by srinivas |   ( Updated:2021-09-03 04:33:25.0  )
పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే ?
X

దిశ, ఏపీ బ్యూరో: పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మహమ్మారి బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయునికి కరోనా సోకింది. ఆరో తరగతి-1, ఎనిమిదో తరగతి-2, పదో తరగతి-2 విద్యార్థులు కరోనా బారినపడ్డారు. కరోనా బారినపడ్డ విద్యార్థులంతా ముసునూరుకు చెందిన వారే కావడం గమనార్హం. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికే జంకుతున్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్సనందిస్తున్నారు వైద్యులు. అలాగే పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed