కరోనా మృతదేహాల తారుమారు..

by srinivas |
కరోనా మృతదేహాల తారుమారు..
X

దిశ, వెబ్ డె్స్క్ : ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతిచెందిన వ్యక్తుల డెడ్ బాడీలను వారి కుటుంబసభ్యులకు అందజేయడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో బాధితులు యాజమాన్యం, సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో మంగళవారం వెలుగులోకివచ్చింది.

వివరాల్లోకివెళితే.. కంభంకు చెందిన ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి కరోనా లక్షణాలతో రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో చేరాడు. 12 రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించి మృతిచెందాడు. కాగా, ఆదివారం ఖలీల్ మృతి వివరాలను సిబ్బంది కుటుంబసభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వచ్చిన ఖలీల్ కుటుంబ సభ్యులకు ఆస్పత్రి సిబ్బంది వీరయ్య అనే మరో మృతదేహాన్ని అప్పగించారు. దీంతో వారు సిబ్బందిని నిలదీశారు. అయినా ఎవరు స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా, ఖలీల్ మృత దేహాన్ని ఆస్పత్రి సిబ్బంది వీరయ్య కుటుంబసభ్యులకు అంతకుముందే అప్పగించారు. వారు ఆ బాడీకి ఒంగోలులో అంత్యక్రియలు పూర్తి చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖలీల్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed