UCIL Recruitment: యురేనియం కార్పొరేషన్లో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలివే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-09 12:44:41.0  )
UCIL Recruitment: యురేనియం కార్పొరేషన్లో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలివే..!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 82 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.uraniumcorp.in ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 30 నవంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

  • మైనింగ్ మేట్-సి - 64
  • వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-బి - 10
  • బ్లాస్టర్-బి - 8

విద్యార్హత:

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు..మైనింగ్ మేట్ గా ఐదేళ్లు, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ గా మూడేళ్లకు పైగా పని చేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

మైనింగ్ మేట్-సి పోస్టుకు 35 ఏళ్లు, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-బి, బ్లాస్టర్-బి పోస్టులకు 32 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు మంచి వేతనంతో పాటు వసతి, విద్యా, వైద్య మొదలైన సౌకర్యాలు ఉంటాయి.

Advertisement

Next Story