ఇండియన్ రైల్వేలో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

by Seetharam |
ఇండియన్ రైల్వేలో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ,వెబ్‌డెస్క్: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 ఏడాదికి రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ విభాగంలో అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 1033

అర్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడులలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జులై 1, 2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేదీ: జూన్ 22, 2023

వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in

Advertisement

Next Story