ఆ కాలేజీలో డిగ్రీతో పాటు ఉచితంగా హాస్టల్.. ఫ్రీ ట్రైనింగ్

by Vinod kumar |   ( Updated:2023-04-13 13:54:23.0  )
ఆ కాలేజీలో డిగ్రీతో పాటు ఉచితంగా హాస్టల్.. ఫ్రీ ట్రైనింగ్
X

దిశ, ఎడ్యుకేషన్: కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల (అటానమస్, కో ఎడ్యుకేషన్).. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి సిల్వర్ సెట్ - 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ డిగ్రీ కోర్సు (ఇంగ్లిష్ మీడియం)ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా బోధించడంతోపాటు భోజన వసతి, శిక్షణ అందిస్తారు.

ఎంట్రన్స్ టెస్ట్: సిల్వర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023.

కోర్సులు.. సీట్ల వివరాలు:

బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్) - 20

బీఏ (హిస్టరీ, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్ మెంట్, ఎకనామిక్స్) - 20

బీకాం జనరల్- 20

బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) - 30

బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) - 20

బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్) - 50

బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్,కంప్యూటర్ సైన్స్) - 20

బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, వెబ్ టెక్నాలజీ) - 20

బీఎస్సీ (బోటనీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ) - 20

బీఎస్సీ(జువాలజీ , బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ) - 20

బీఎస్సీ (హార్టీకల్చర్, బోటనీ, కెమిస్ట్రీ) - 20

బీఎస్సీ (జువాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ) - 20

అర్హత: మార్చి 2023లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్హులు.

ఎంపిక: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

చివరితేది: మే 6, 2023.

సీబీటీ పరీక్ష: మే 25, 2023.


వెబ్‌సైట్: https://www.sjgckurnool.edu.in/

Also Read...

ఎయిమ్స్‌లో భారీగా నర్సింగ్ పోస్టుల భర్తీ.. ఎంపిక ఎలాగంటే..?


Advertisement

Next Story