మీరు 10th పాస్ అయ్యారా.. నెలకు రూ.35 వేలు సంపాదించే అవకాశం మీ కోసమే..

by Sumithra |
మీరు 10th పాస్ అయ్యారా.. నెలకు రూ.35 వేలు సంపాదించే అవకాశం మీ కోసమే..
X

దిశ, వె‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అంటే నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ - గ్రూప్ సి పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 2 నుండి ప్రారంభమవుతుంది. చివరి తేదీ అక్టోబర్ 21. అభ్యర్థులు నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nabard.org/ ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తును ఈజీగా చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ..

ముందుగా NABARD అధికారిక వెబ్‌సైట్ https://www.nabard.org/ కెరీర్ పేజీకి లాగిన్ అవ్వాలి.

నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి లింక్‌ పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్‌ పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను పూరించండి.

ఆ తర్వాత నమోదు చేసుకోండి.

రిజిస్ట్రేషన్ తర్వాత ఇచ్చిన ఆధారాలతో లాగిన్ చేయండి.

ఆపై మీ దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి. నమోదు చేసిన అన్ని వివరాలను మరోసారి చెక్ చేయండి.

ఇప్పుడు వివరాలను సేవ్ చేయండి.

ఆ తరువాత నిర్ణీత ఫార్మాట్‌లో ఫోటో, సంతకం, ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయండి.

అన్ని వివరాలను ధృవీకరించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.

దరఖాస్తు రుసుము వివరాలు..

SC/ST/PWBD/EXS కోసం దరఖాస్తు రుసుము లేదు. కానీ వారు రూ. 50 ఇంటిమేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ. 400, అలాగే రూ. 50 సమాచార రుసుమును చెల్లించవలసి ఉంటుంది. అంటే మొత్తంగా వారు రూ. 450 దరఖాస్తు రుసుమును చెల్లించవలసి ఉంటుంది.

విద్యార్హత..

అభ్యర్థులు వారు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రం/ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి వచ్చే సంబంధిత రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నుండి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే మాజీ సైనికులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 15 సంవత్సరాల సర్వీస్ కూడా అవసరం. అలాగే ఆఫీస్ అటెండెంట్ పోస్టుకు అభ్యర్థుల వయస్సు పరిమితిని 18 నుండి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే రిజర్వ్డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.

ఎంపిక ప్రక్రియ.. వేతనం..

అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT) ఈ రెండు దశల పరీక్ష తర్వాత నాబార్డ్‌ బ్యాంక్ ఆఫీస్ అటెండెంట్ పోస్టుకు ఎంపిక అవుతారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.35 వేలు వేతనం ఇవ్వనుంది నాబార్డ్.

మరింత సమాచారం కోసం మీరు NABARD అధికారిక వెబ్‌సైట్ www.nabard.org ని సందర్శించవచ్చు

Advertisement

Next Story

Most Viewed