- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్: ఇండియన్ పాలిటీ
పార్లమెంట్:
పార్లమెంట్ అనగా లోక్‌సభ, రాజ్యసభ, రాష్ర్టపతి అని అర్థం.
రాష్ర్టపతి పార్లమెంట్‌లో అంతర్భాగం
ఆర్టికల్ 111: ఒక బిల్లు చట్టం కావాలంటే రాష్ర్టపతి ఆమోదం అవసరం.
రాజ్యసభ:
ఆర్టికల్ 80: రాజ్యసభ గురించి పేర్కొంటుంది.
రాజ్యసభను ఎగువ సభ, మేదావుల సభ, రాష్ర్టాల పరిషత్, రాష్ర్టాల మండలి, పెద్దల సభ అని పిలుస్తారు.
రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250
రాజ్యసభ ప్రస్తుత సభ్యుల సంఖ్య - 245.
వీరిలో రాష్ర్టాల నుంచి 229, కేంద్రపాలిత ప్రాంతాలు (ఢిల్లీ, పాండిచ్చేరి) నుంచి - 4 సభ్యులు, రాష్ర్టపతి 12 మందిని కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ రంగాల నుంచి నామినేట్ చేస్తారు.
రాజ్యసభ సభ్యుల అర్హతలు:
భారత పౌరుడు అయి ఉండాలి.
30 ఏళ్లు వయసు ఉండాలి.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండరాదు. ఒక వేళ ఉంటే రాజీనామా చేసి పోటీచేయాలి.
రాజ్య సభ సభ్యుల పదవీకాలం:
రాజ్యసభ సభ్యుల పదవి కాలం సాధారణంగా 6 ఏళ్లు ఉంటుంది.
ప్రతి 2 ఏళ్లకు 1/3వ వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు.
తిరిగి అంతే సభ్యులను నియామకం చేస్తారు.
అనగా సభ పదవీ కాలం శాశ్వతం.
రాజ్యసభను శాశ్వత సభ, నిరంతరసభ, పెద్దల సభ అని పిలుస్తారు.
రాజ్యసభ పదవి కాలం - శాశ్వతం
రాజ్యసభ సభ్యుల పదవికాలం - 6 ఏళ్లు.
రాజ్యసభ ఎప్పటికీ రద్దుకాదు.
రాజ్యసభ ప్రత్యేకతలు:
రిజర్వేషన్లు ఉండవు
నియోజక వర్గాలు ఉండవు.
రాష్ర్ట నివాసి కానవసరం లేదు.
రాజ్యసభ నుండి మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి లోక్ సభకు బాధ్యత వహించాలి.
రాజ్యసభ ప్రత్యేక అధికారాలు:
అఖిల భారత సర్వీసు ఏర్పాటు చేయాలని సూచించేది రాజ్యసభ.
దేశంలో అఖిల భారత సర్వీసు ఏర్పాటుకు రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో తీర్మానం చేస్తే పార్లమెంట్ ఆమేరకు చట్టం చేస్తుంది.
అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసేది పార్లమెంట్.
ఉపరాష్ర్టపతి తొలగింపు తీర్మానం మొదట రాజ్యసభలోనే ప్రవేశ పెట్టాలి.
లోక్‌సభ:
ఆర్టికల్ 81: లోక్‌సభ గురించి పేర్కొంటుంది.
లోక్‌సభను ప్రజా ప్రతినిధుల సభ, తాత్కాలిక సభ అని కూడా అంటారు.
లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 552.
లోక్‌సభకు 530 మంది సభ్యులను రాష్ర్టాల ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.
మరో 20 మంది సభ్యులను కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు ఎన్నుకుంటారు.
ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ర్టపతి నామినేట్ చేస్తారు.
లోక్‌సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య - 545
వీరిలో రాష్ర్టాల నుండి 530 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 13 మందిని ప్రజలు ఎన్నుకున్నారు.
మరో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ర్టపతి నామినేట్ చేశారు.
లోక్ సభ సభ్యుల అర్హతలు:
25 ఏళ్ల వయసుండాలి.
వయసు మినహా మిగిలినవన్నీ రాజ్యసభ సభ్యుల అర్హతలుండాలి.
లోక్‌సభ పదవికాలం సాధారణంగా 5 ఏళ్లు.
ప్రత్యేక సందర్భాలు: లోక్ సభను గడువు కంటే ముందే ప్రధాని సలహాపై రాష్ర్టపతి రద్దు చేస్తారు.
జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు 1 ఏడాది చొప్పున పొడిగించవచ్చు.
పదవీ కాలం ముగిసిన లోక్‌సభ దానంతట అదే రద్దువుతుంది.
లోక్‌సభకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ,ఎస్టీ వర్గాలకు కొన్ని ప్రత్యేక స్థానాలు జనాభా ప్రాతిపదికన రిజర్వు చేయబడతాయి. ఎస్‌సీ-84, ఎస్‌టీ - 47
లోక్‌సభ ప్రత్యేక అధికారాలు:
ప్రభుత్వ ఏర్పాటు: లోక్ సభలో మెజారిటీ పొందిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
మెజారిటీ పొందిన పార్టీ విశ్వాసం పొందితేనే మనుగడ ఉంటుంది.
ఎన్నికల్లో మెజారిటీ పొందిన పార్టీ లోక్‌సభలో విశ్వాసం పొందాలి.
అవిశ్వాస తీర్మానం: దీనిని ప్రతిపక్ష పార్టీ అధికార ప్రభుత్వం మీద లోక్‌సభలో ప్రవేశ పెడుతుంది.
ఈ తీర్మానం మద్ధతుకి 50 మంది లోక్‌సభ సభ్యుల మద్దతు అవసరం.
అవిశ్వాస పరీక్ష నెగ్గితే ప్రభుత్వం రాజీనామ చేయాలి.
ఆర్థిక బిల్లు: ఆర్థిక బిల్లును రాష్ర్టపతి పూర్వ అనుమతితో ముందుగా లోక్‌సభలోనే ప్రవేశ పెట్టాలి.
బడ్జెట్: ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెడతారు.
లోక్‌సభలో బడ్జెట్ పై చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది.
ఓటింగ్‌లో బడ్జెట్ ఓడిపోతే/ఆమోదం తెలుపకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
ప్రభుత్వ బిల్లు లోక్ సభలో ఓడితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
ప్రైవేటు సభ్యుడు (మంత్రి కాని సభ్యుడు) ప్రవేశ పెట్టిన బిల్లును ప్రభుత్వం వ్యతిరేకించి ఆ బిల్లు నెగ్గితే రాజీనామా చేయాలి.
నోట్: రాజ్యసభ, లోక్ సభ ప్రత్యేక అధికారాలు మినహాయిస్తే మిగతా అధికారాలు ఉభయ సభలు (పార్లమెంట్) కలిగి ఉంటాయి.
బిట్ పాయింట్స్:
పార్లమెంట్ భవన శిల్పి- ఎడ్వర్ట్ ఎటియన్స్, హెర్డర్ట్ బేకర్
పార్లమెంట్ భవనం పేరు - సంసద్ భవన్
అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న రాష్ర్టం - యూపీ (80 సీట్లు)
తక్కువ లోక్ సభ స్థానాలు ఉన్న రాష్ర్టం - నాగాలాండ్, సిక్కిం, మిజొరాం (1 సీటు)
తెలంగాణ లోక్ సభ స్థానాలు - 17