- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NSCL: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 188 ఖాళీలు.. ధరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్..!
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi)లోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్(NSCL) పలు ఉద్యోగాల భర్తీకి అక్టోబర్(October)లో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.indiaseeds.com/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 8 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- డిప్యూటీ జనరల్ మేనేజర్ - 01
- అసిస్టెంట్ మేనేజర్ - 01
- మేనేజ్మెంట్ ట్రైనీ - 05
- సీనియర్ ట్రైనీ - 02
- ట్రైనీ - 179
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ల్బ్, బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 27 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,616 నుంచి రూ. 1,41,260 వరకు జీతం ఉంటుంది.