- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు..
దిశ, వెబ్‌డెస్క్: పట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) రెగ్యులర్ ప్రాతిపదికన 47 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. స్క్రీనింగ్, రాత/స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు, గరిష్ఠ వయసులో తేడాలు ఉంటాయి. అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యమిస్తారు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా స్క్రీనింగ్ నిర్వహించి అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌ను తయారుచేస్తారు.
ఎంపిక: స్క్రీనింగ్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (ఎంసీక్యూ) అండ్ డిస్క్రిప్టివ్/ షార్ట్ ఆన్సర్ టెస్ట్‌లు ఉంటాయి.
సూపరింటెండెంట్: 05 ఖాళీలు.
ఏదైనా డిగ్రీ మొదటి తరగతిలో పాసవ్వాలి. లేదా పీజీ రెండో తరగతిలో పాసవ్వాలి. ట్యాలీ అండ్ అకౌంటింగ్ నాలెడ్జ్, కంప్యూటర్, స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.
టెక్నికల్ అసిస్టెంట్:
సివిల్, ఎలక్ట్రికల్, కెమికల్ టెక్నాలజీ, సర్వర్ అండ్ నెట్వర్క్, ఎంఐఎస్, హార్డ్‌వేర్, మెకట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో 11 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/ ఇంజినీరింగ్ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. పరిశ్రమలో పనిచేసిన అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.
టెక్నీషియన్:
వెబ్సైట్, ఎంఐఎస్, హార్డ్‌వేర్, నెట్వర్కింగ్, మెకట్రానిక్స్, కెమికల్ టెక్నాలజీ, మెటీరియల్ ఇంజినీరింగ్, ఈఎస్యూ, ఈఎంయూ, మేథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, సీఎస్ఈ, ఈసీఈ, సివిల్ విభాగాల్లో 18 ఖాళీలు ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ 60 శాతం మార్కులతో పాసవ్వాలి/50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, ఏడాది వ్యవధి ఉండే ఐటీఐ పాసవ్వాలి/ పదో తరగతి 60 శాతం మార్కులతో పాసై, రెండేళ్ల ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి/మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పాసవ్వాలి. వెబ్ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, పీసీ/సర్వర్, డేటా మెయింటెనెన్స్ చేసేవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 6 ఖాళీలు.
ఇంటర్మీడియట్ పాసై, ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 పదాలు ఉండాలి. కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌షీట్ నైపుణ్యం ఉండాలి. ట్యాలీ, అకౌంటింగ్, స్టెనోగ్రఫీ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
ఆఫీస్ అటెండెంట్: 7 ఖాళీలు.
ఇంటర్మీడియట్ పాసవ్వాలి. కమ్యూనికేషన్ స్కిల్, రికార్డ్ కీపింగ్ పరిజ్ఞానం ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.400. ఎస్సీ/ఎస్టీలకు రూ.200. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 28.11.2023 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.11.2023. సపోర్టింగ్ డాక్యుమెంట్లతో దరఖాస్తు ప్రింటవుట్ సమర్పించడానికి చివరి తేదీ: 07.12.2023
దరఖాస్తుకు విద్యార్హతలు, ఉద్యోగ అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను జతచేసి ‘రిజిస్ట్రార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నా, అశోక్ రజ్పత్, పట్నా-800 005’ చిరునామాకు స్పీడ్/రిజిస్టర్డ్ పోస్టులో పంపించాలి. కవరు మీద దరఖాస్తు చేస్తున్న ఉద్యోగం పేరును స్పష్టంగా రాయాలి. అభ్యర్థుల ఎంపిక విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెబ్సైట్లో ఉంచుతారు.
వెబ్సైట్: www.nitp.ac.in