టెన్త్, ఇంటర్ అర్హతతో విజయనగరం జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు

by Kavitha |   ( Updated:2022-04-01 03:35:23.0  )
టెన్త్, ఇంటర్ అర్హతతో విజయనగరం జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APVVP) కమిషనర్ కార్యాలయం విజయనగరం జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 4

*ఇందులో థియేటర్ అసిస్టెంట్, బయో మెడికల్ ఇంజినీర్, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి టెన్త్ క్లాస్, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్(బయోమెడికల్ ఇంజనీరింగ్) పాసై ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టరై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 మార్చి1 నాటికి 42 ఏళ్లకు మించరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం అకడమిక్ మెరిట్, ఎక్స్ పీరియన్స్, రిజర్వేషన్ చూస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 నుంచి రూ.52000 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును District Coordinator of Hospital Services (APVVP), District Hospital, vizianagaram, AP చిరునామాకి పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://vizianagaram.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Advertisement

Next Story

Most Viewed