చరిత్రను ఇలా జయిద్దాం.. జేఎల్ హిస్టరీ ప్రిపరేషన్ ప్లాన్

by Vinod kumar |
చరిత్రను ఇలా జయిద్దాం.. జేఎల్ హిస్టరీ ప్రిపరేషన్ ప్లాన్
X

దిశ, కెరీర్: టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న జూనియర్ లెక్చరర్ సిలబస్ ప్రకారం.. మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ సబ్జెక్ట్, రెండో పేపర్ లో హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రశ్నా పత్రం ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. ఆ సబ్జెక్టు చరిత్ర కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చరిత్ర సబ్జెక్టు లో మీడియం పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటుంది. ప్రశ్నల స్థాయి పి.జి స్థాయిలో ఉంటుందని నోటిఫికేషన్ లోనే పేర్కొన్నారు. ఇక హిస్టరీ ఎలా జయించాలో ..ప్రిపరేషన్ వ్యూహాలేంటో తెలుసుకుందాం..

హిస్టరీ సబ్జెక్టు సిలబస్:

ప్రాచీన భారతదేశ చరిత్ర.

మధ్య యుగ భారతదేశ చరిత్ర

ఆధునిక భారతదేశ చరిత్ర

ఆధునిక ప్రపంచ చరిత్ర

తెలంగాణ చరిత్ర.

తెలంగాణ ఉద్యమ చరిత్ర :

రాష్ట్ర ఆవిర్భావం మాత్రం సిలబస్ లో లేదు. అంటే 1948 నుండి 2014 వరకు సంబంధించిన అంశాలను చదవాల్సిన అవసరం లేదు. మొత్తం 5 సబ్జెక్టులను విస్తృతంగా ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో తెలంగాణ చరిత్రకు సంబంధించి తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రాచీన భారతదేశ చరిత్ర:

దీనిలో మొత్తం 9 అధ్యయనాలు ఇవ్వడం జరిగింది. మొదటి అధ్యయనం చరిత్ర నిర్వచనం, స్వభావం, ఆధారాలు అయితే చివరి అధ్యాయం క్రీ.శ. ఏడవ శతాబ్దంలో భారతదేశం గురించి ఉంది. మొత్తం 9 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు పురావస్తు చరిత్రకు అనుసంధానమై ఉంటుంది. కాబట్టి చరిత్ర అభ్యర్థులు సాధారణంగా పురావస్తు చరిత్రపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ సిలబస్ ప్రకారం చూస్తే దృష్టి పెట్టాల్సి ఉంటుంది.


ప్రాచీన చరిత్రలో ప్రతి అధ్యయనంలో కూడా రాజకీయ, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను చదవవలసి ఉంటుంది. అయితే కొన్ని అధ్యయనాల్లో కళలు, నిర్మాణం, కట్టడాలు, సాహిత్యాన్ని కూడా విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రాచీన భారతదేశ చరిత్రలో ప్రశ్నల స్థాయి కొంచెం కఠినంగానే ఉంటుంది. కాబట్టి లోతుగా చదివితే గాని ప్రశ్నలకు సమాధానం రాయలేము.

మధ్యయుగ భారతదేశ చరిత్ర:

సిలబస్ ప్రకారం మధ్యయుగ భారతదేశ చరిత్రను రెండుగా విభజించుకోవాలి. మొదటిది తొలి మధ్య యుగం క్రీ.శ 650 నుండి 1707 వరకు అని విభజించు కొని చదవాలి. అయితే క్రీ.శ 1206 నుండి క్రీ.శ 1526 వరకు ఢిల్లీ సుల్తానుల యుగం అయితే క్రీ.శ 1526 నుండి క్రీ.శ 1707 వరకు మొఘల్ యుగంగా భావించి చదువుకోవాలి. మధ్యయుగ భారతదేశ చరిత్ర బాగా విస్తృతమైన అంశం, కాబట్టి దీనిలో చాలా అంశాలు ఉంటాయి. అయితే వంశాల వారీగా గుర్తుపెట్టుకుంటే గానీ పరీక్ష హాలులో సమాధానం రాయలేము.

ఒక్కో అధ్యాయంలో టాపిక్ పేరు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాని సబ్ టాపిక్ కూడా ఇవ్వలేదు అంటే విస్తృతంగా అధ్యాయాన్ని చదవాలని అర్థం లేకపోతే అన్ని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం కష్టం అవుతుంది.


ఉదాహరణకు క్రీ.శ 650 నుండి క్రీ.శ 1200 వరకు మధ్య కాలంలో భారత దేశం అని సిలబస్ లో ఉంది. కానీ ఈ కాల పరిధిలో దక్షిణ, ఉత్తర భారతదేశంలో వివిధ రాజవంశాల వారు పరిపాలించడం జరిగింది. ఉత్తర భారతదేశంలో వివిధ రాజవంశాల వారు పరిపాలించారు. ఆ రాజవంశాల అన్నింటినీ సంపూర్ణంగా చదవవలసి ఉంటుంది.

ఆధునిక భారతదేశ చరిత్ర:

సాధారణంగా చరిత్ర అభ్యర్థులకు కూడా ఆధునిక భారతదేశ చరిత్ర ను గుర్తు పెట్టుకోవడం సులభం అయితే ఇక్కడ సిలబస్ ప్రకారం భారత జాతీయ ఉద్యమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. జాతీయ ఉద్యమాన్ని మూడు దశలుగా విభజించుకుని చదవాలి. మొదటి దశ 1885 - 1905, రెండో దశ 1905 - 1920, మూడవ దశ 1920- 1947 ..ఈ మూడు దశలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.


ఆధునిక భారతదేశ చరిత్ర ప్రశ్నలను సులభంగా సమాధానం గుర్తించగలం అనుకుంటారు. ఎక్కువ తప్పులు చేసేది ఇక్కడే. జాతీయ ఉద్యమం ప్రశ్నలు సాధారణంగా సులభంగానే కనిపించినా, బాగా కన్ఫ్యూజన్‌ను చేస్తూ ఉంటాయి. కాబట్టి జరిగిన సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాలు, తేదీలను కూడా కొన్ని టాపిక్ లను గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జాతీయ ఉద్యమం మూడవ దశ సంబంధించిన సంఘటనలను సంవత్సరాల వారిగా క్రమ పద్ధతిలో గుర్తు పెట్టుకోవాలి.

ఆధునిక ప్రపంచ చరిత్ర:

ఆధునిక ప్రపంచ చరిత్ర సబ్జెక్టు కొంతవరకు కఠినంగా అనిపించినా లోతుగా అధ్యయనం చేస్తే సులువుగా సమాధానాలను రాయవచ్చు. ఆధునిక ప్రపంచ చరిత్రను, సమకాలీన ప్రపంచంలో జరిగే సంఘటనలను అనుసంధానం చేసి చదివితే మంచిగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

ఉదాహరణకు పారిశ్రామిక విప్లవం, అమెరికా విప్లవం, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఐక్యరాజ్యసమితి. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు జరగడానికి గల కారణాలు, ఐక్యరాజ్యసమితి ఏర్పడటానికి గల కారణాలు, తర్వాత జరిగిన పరిణామాలను విశ్లేషించగలగాలి.

తెలంగాణ చరిత్ర:

తెలంగాణ చరిత్ర అంటే ప్రాచీన మధ్యయుగ, ఆధునిక తెలంగాణ చరిత్ర అని అర్థం చేసుకోవాలి. సిలబస్ లో మాత్రం పై మూడు అంశాలను ఇవ్వడం జరిగింది. గతంలో చెప్పినట్లు తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆవిర్భావం మాత్రం సిలబస్ లో పొందుపరచలేదు.

తెలంగాణ చరిత్రలో మాత్రం చాలా టాపిక్ లు ఉంటాయి. అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాని ప్రశ్నలు మాత్రం చాలా తక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. తెలంగాణ చరిత్ర మీద ఇచ్చే కొన్ని ప్రశ్నలను కూడా లోతుగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే ప్రామాణిక పుస్తకాలు చదవకుండా లోకల్ పుస్తకాలు చదివితే చాలా పదకోశాలు, సంవత్సరాలు, తేదీలు తప్పులు ఉండే అవకాశం ఉంది. ప్రామాణికమైన పుస్తకాలను చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed