- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు శుభవార్త.. ఐటీఐ అర్హతతో ECIL హైదారాబాద్ లో భారీగా ఉద్యోగాలు, త్వరపడండి
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1625
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 11
*వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 30 ఏళ్లు మించరాదు.
*ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.20,480, రెండో సంవత్సరం నెలకు రూ.22528, మూడో ఏడాది నెలకు రూ.24780 వేతనం చెల్లిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://careers.ecil.co.in/login.php వెబ్ సైట్ ను చూడొచ్చు.