IIT JAM : సెప్టెంబర్ మొదటి వారంలోనే IIT JAM రిజిస్ట్రేషన్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

by Sumithra |   ( Updated:2024-08-31 12:38:33.0  )
IIT JAM : సెప్టెంబర్ మొదటి వారంలోనే IIT JAM రిజిస్ట్రేషన్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : IIT JAM 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 3 నుండి ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ మాస్టర్స్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందగలరు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joaps.iitd.ac.inని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 11గా ప్రకటించారు.

పరీక్ష తేది వివరాలు..

JAM 2025 పరీక్ష 2 ఫిబ్రవరి 2025న దేశంలోని 100 నగరాల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, జియాలజీ పరీక్షలు ఉదయం షిఫ్ట్‌లో, బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ పరీక్షలను మధ్యాహ్నం షిఫ్ట్‌లో నిర్వహిస్తారు.

ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు IIT లలో వివిధ పోస్ట్- గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో సుమారు 3 వేల సీట్లకు, IISc, NIT, IIEST షిబ్‌పూర్, SLIET, DIAT లలో 2 వేలకు పైగా సీట్లకు CCMN ద్వారా ప్రవేశానికి ఎంపిక చేస్తారు. JAM 2025 ప్రతి టెస్ట్ పేపర్‌లో సీట్ల లభ్యత, ప్రభుత్వ రిజర్వేషన్ విధానం, ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది.

IIT JAM 2025 : అర్హత ప్రమాణాలు..

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చివరి సంవత్సరంలో ఉన్నవారు లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసిన వారు JAM 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు వయోపరిమితి లేదు.

IIT JAM 2025 దరఖాస్తు ప్రక్రియ..

ముందుగా అధికారిక వెబ్‌సైట్ joaps.iitd.ac.inకి లాగిన్ అవ్వండి.

హోమ్‌పేజీకి వెళ్లిన తరువాత JAM 2025 లింక్ పై క్లిక్ చేయండి.

పూర్తివివరాలను నమోదు చేయండి. అభ్యర్థి ID, పాస్‌వర్డ్‌ను సృష్టించాలి.

విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత దరఖాస్తు ఫారమ్ నింపండి.

ఆపై అవసరమైన సర్టిఫికెట్ లను అప్‌లోడ్ చేసి దరఖాస్తు రుసుమును చెల్లించండి.

మొత్తం సమాచారాన్ని మరోసారి చెక్ చేసి సబ్మిట్ బటన్‌ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు IIT JAM 2025 రిజిస్ట్రేషన్ ఫారమ్ హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

మరింత సమాచారం కోసం, అభ్యర్థులు joaps.iitd.ac.in ని సందర్శించవచ్చు .

Advertisement

Next Story