నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,696 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

by Ramesh Goud |   ( Updated:2024-01-20 07:40:08.0  )
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,696 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా రైళ్వేలో పలు రీజియన్లలో ఖాళీగా ఉన్న 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, ఇవ్వాళ్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 20వ తేదీన మొదలై, ఫిబ్రవరి 19 తేదీన ముగుస్తుంది. దేశ వ్యాప్తంగా 5,696 పోస్టులు ఉండగా దక్షిణ మధ్య రైళ్వే జోన్ పరిధిలో 559 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలు నోటిఫికేషన్ లో పొందుపరచబడ్డాయి.

దరఖాస్తుల ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా

విద్యార్హతలు: 10th, ఐటీఐ/డిప్లొమా పాసైనవారు అర్హులు.

వయోపరిమితి: 01-07-2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు)

పే స్కేలు: నెలకు రూ. 19,900- రూ.63,200

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్ధులకు రూ.250. ఇతరులకు రూ.500 గా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1,2. డాక్యూమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed