- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bank Of Maharashtra Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ..
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
పోస్టులు: ఆఫీసర్ స్కేల్-3 పోస్టులు 100, ఆఫీసర్ స్కేల్-2 పోస్టులు 300 ఖాళీలు ఉన్నాయి.
వయస్సు: ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
జీతం: స్కేల్-3 పోస్టులకు నెలకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు.. స్కేల్-2 పోస్టులకు నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు జీతంగా చెల్లిస్తారు.
చివరి తేదీ: దరఖాస్తులకు జులై 25, 2023వ తేదీ లోగా పంపాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీలకు చెందిన వారు రూ.1180, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.118 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.
వెబ్ సైట్: https://bankofmaharashtra.in/