వైర్ మెన్, సూపర్ వైజర్స్ దరఖాస్తు గడువు పొడిగింపు

by karthikeya |
వైర్ మెన్, సూపర్ వైజర్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎలక్ట్రికల్ వైర్ మెన్, సూపర్ వైజర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును స్టేట్ టెక్నికల్ బోర్డు అధికారులు పొడిగించారు. ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇటీవల వచ్చిన వరుస సెలవుల నేపథ్యంలో ఈ గడువును పొడిగించినట్లు తెలిసింది. ఇటీవల ఇదే విషయమై తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు సాంకేతిక విద్యాశిక్షణ మండలి కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే నేపథ్యంలో అధికారులు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా పరీక్షను మాత్రం యథాతథంగా ముందుగా నిర్ణయించినట్లే 30వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed

    null