పాప్ సింగర్‌కు పోయే కాలం..

by  |   ( Updated:2020-11-11 06:15:41.0  )
పాప్ సింగర్‌కు పోయే కాలం..
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికన్ పాప్ సింగర్ కార్డి బి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కార్డి.. ఈ సారి భారతీయుల మనోభావాలు కించపరిచేలా మరో కాంట్రవర్సీని మోసుకొచ్చింది. ‘రక్షణ, అంతర్గత బలానికి చిహ్నంగా నిలిచే దుర్గామాతకు నివాళులు అర్పిస్తున్నాను’ అని తెలుపుతూ ఓ ఫొటో షేర్ చేసి, తద్వారా తన స్నీకర్ కలెక్షన్‌ను ప్రమోట్ చేసుకుంటుంది. స్లీవేజ్ డ్రెస్‌లో పొడుగు హెయిర్‌తో ఉన్న సింగర్.. ఎనిమిది చేతులతో కనిపిస్తూనే చేతిలో షూస్ మోస్తూ ఫొటోకు పోజిచ్చింది.

ఈ ఫొటోపై ఇండియన్స్ మండిపడుతున్నారు. అమ్మవారికి అంకితం అంటూ ఇలాంటి పిచ్చిపనులు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. అమ్మవారి ఆధ్యాత్మికత గురించి తెలిసే ఇలా చేశావా? అని ఫైర్ అవుతున్నారు. నీ బ్రాండ్ ప్రమోట్ చేసుకునేందుకు భారతీయులను కించపరుస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గాదేవి ఎప్పుడూ ఇలాంటి శరీరంతో కనిపించలేదని, ఆలయంలోకి చెప్పులతో వెళ్లడమే మేము తప్పుగా భావిస్తామని.. అలాంటిది కార్డి బి తనను తాను దుర్గామాతగా అభివర్ణించుకుంటూ చేతిలో షూ పట్టుకుని ఉందని మండిపడుతున్నారు. దుర్గామాత ఎప్పుడూ సౌందర్యంగా కనిపించలేదని, ఇది నివాళి కాదు అగౌరవపరచడమే అవుతుందంటున్నారు.

దీంతో తన తప్పు తెలుసుకున్న కార్డి బి.. ఎవరి సంస్కృతిని కించపరచడం తన ఉద్దేశం కాదని చెప్పింది. ఇలా చేసినందుకు క్షమాపణలు తెలిపిన తను.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతానని తెలిపింది.

Advertisement

Next Story