అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి దుర్మరణం

by Shyam |
అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి దుర్మరణం
X

దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని రాచకొండలో కారు అదుపుతప్పి ఒకరు దుర్మరణం చెందారు. వివరాళ్లోకి వెళితే.. హైదరాబాద్ బాలాపూర్‌కు చెందిన తబ్రేజ్ ఖాన్(38), మఖ్బూల్(70), హషం(40) ముగ్గురు మంగళవారం రాచకొండలోని గాలిబ్ షా దర్గాకు కారులో వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో శివాలయం వద్ద మలుపు తిరుగుతూ.. కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో పక్కనే ఉన్న పొదలలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తబ్రేజ్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఇద్దరు గాయాలపాలయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడపటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువు నసీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగరాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed