క్షణంలో పొరపాటు.. వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

by Sumithra |   ( Updated:2021-12-01 07:08:11.0  )
క్షణంలో పొరపాటు.. వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు
X

దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న చిట్టాపూర్ భూంపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన గల వ్యవసాయ బావిలో ఓ కారు వేగంగా దూసుకువచ్చి అదుపు తప్పి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్, పలుశాఖల సిబ్బంది ఆధ్వర్యంలో బావిలోని నీరును బయటకు తోడుతున్నారు.

బావి లోతు సుమారు పదిహేను నుంచి ఇరవై గజాలు ఉన్నట్టు స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నీటిని తోడే కార్యక్రమం మరింత వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బావిలో నుంచి నీరు పూర్తిగా తోడేస్తే గానీ ఆ వాహనంలో ఎంత మంది ఉన్నారనేది తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు పోలీసులు అక్కడి పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు.

Advertisement

Next Story