కారు బోల్తా…ఒకరి మృతి…

by Aamani |   ( Updated:2021-06-11 08:19:43.0  )
car accident in asifabad
X

దిశ, అసిఫాబాద్: కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన కోమరంభీం అసిఫాబాద్ జిల్లా జైనుర్ మండలం జంగావ్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఇంద్రవెళ్లి మండలంకి చెందిన ముగ్గురు యువకులు శుక్రవారం ఒక కారులో వెళుతుండగా జైనుర్ మండలం జంగావ్ గ్రామ సమీపంలోని హనుమాన్ గుడి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఇంద్రవెళ్లి కి చెందిన సొన్ కంబ్లే తరుణ్(16) అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed