బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి

by Anukaran |
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛ‌త్త‌ర్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బుధవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు జలసమాధి అయ్యారు. గమనించిన స్థానికులు మరో ముగ్గురిని కాపాడారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story