- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాంపల్లిలో కారు బీభత్సం
దిశ ప్రతినిధి , హైదరాబాద్: నాంపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాలపైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ఆరు ద్వి చక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. కాగా ఒకరికి గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…లాల్ దర్వాజ ప్రాంతానికి చెందిన అశ్విన్ ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో నీలోఫర్ కేఫ్ మీదుగా స్విఫ్ట్ కారు ( నెంబర్ ఏపీ 9 బీహెచ్ 0239 )లో వెళ్తున్నారు. ఈ క్రమంలో నీలోఫర్ కేఫ్ వద్ద టీ తాగేందుకు కారును ఆపే సమయంలో బ్రేక్‌కు బదులుగా యాక్సిలేటర్‌ను తొక్కడంతో హోటల్ ముందు నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలపైకి దూసుకుపోయింది.
హోటల్ వద్ద వాహనాల పార్కింగ్ స్థలంలో విధులు నిర్వహిస్తున్న బిహార్ కు చెందిన రాంప్రసాద్ అలియాస్ మహేశ్‌ను ఢీ కొట్టడంతో కాలుకు గాయం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్సల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని ఇన్ స్పెక్టర్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన అశ్విన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు కారును సీజ్ చేశారు.