కరోనా ఎఫెక్ట్ : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా

by Shyam |
కరోనా ఎఫెక్ట్ : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచ విపత్తులా మారింది. కోవిడ్ 19 కారణంగా పలు దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం కరోనా వ్యాప్తిని నివారించేందుకు సామాజిక దూరం, పరిశుభ్రత పాటించాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్, థియేటర్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా బంద్ కాగా… కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.

మే 12 నుంచి మే 20 వరకు కేన్స్ ఉత్సవాలు జరసాలని నిర్వాహకులు ముందుగా భావించినా.. కరోనా ప్రభావంతో ప్రస్తుతానికి ఈవెంట్ వాయిదా వేయాలని నిర్ణయించారట. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందట. ఈ విషయంపై కేన్స్ సిటీ హాల్, ఫ్రెంచ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఇప్పటికే ఫ్రాన్స్‌ కరోనా ప్రభావంతో ఎక్కడికక్కడ నిర్బంధంలో ఉంది. ఆ దేశంలో 10 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సమావేశాలేవి జరగకుండా ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పూర్తిగా ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపట్టింది.

tags : Cannes Film Festival, CoronaVirus

Advertisement

Next Story

Most Viewed