గంజాయి ముఠా గుట్టురట్టు.. దాని విలువెంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..

by Shyam |   ( Updated:2021-12-06 08:35:59.0  )
గంజాయి ముఠా గుట్టురట్టు.. దాని విలువెంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..
X

దిశ, సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట జాతీయ రహదారి పై గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి కర్ణాటక వెళ్తున్న లారీని తనిఖీ చేయగా అందులో 496 ప్యాకెట్లలో దాదాపు 980కిలోల గంజాయి బయటపడింది. ఆ లారీకి పైలట్ గా ఒక ఇన్నోవా కారు కూడా ఉండటంతో మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను విచారించగా రాజమండ్రి నుండి ఔరంగాబాద్ కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు అంగీకరించారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ.99,20,000 ఉంటుందని అంచనా. నిందితుల నుండి ఒక లారీ, ఇన్నోవా కారు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.7500 లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులను A-l. అల్తాఫ్ అహ్మద్, A-2. అబ్దుల్ రెహమాన్, A-3. షేక్ అమీన్, A-4 ముస్తాక్ అహ్మద్ లుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed