- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధారిలో గంజాయి వనాలు.. ఎకరం విస్తీర్ణంలో పంట సాగు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో గంజాయి సాగు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గంజాయి సాగుకు గాంధారి అడ్డాగా ఉండేది. నాడు పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు ఉక్కుపాదంతో అణిచి వేశారు. కానీ ఇటీవల మళ్లీ గంజాయి సాగు ఉపందుకుంది.
గాంధారి మండల కేంద్రంలోని కొత్త బాది తండా పక్కన ఉన్న పంట చేనులో సోమవారం ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ జాన్ రెడ్డి, గాంధారి పోలీసు బృందాలు ఆకస్మిక దాడి చేశారు. దాదాపు ఒక ఎకరా విస్తీర్ణంలో గంజాయి చెట్లను పెంచినట్లు గుర్తించారు. ఒక ఎకరా విస్తీర్ణంలో గల పంట చేనులో వెయ్యి గంజాయి మొక్కలను గుర్తించి వాటిని ధ్వంసం చేసారు. వెయ్యి మొక్కలు స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మంగళవారం తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి అబ్కారీ అధికారులు కేసులు నమోదు చేయనున్నారు.
ఐదు రోజుల క్రితం 267 గంజాయి మొక్కలు ధ్వంసం
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని కాయితి తండా గ్రామపంచాయతీ పరిధిలోని ధన్ సింగ్ తండాలో రతన్ సింగ్ అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, కంది చెనులో అంతర పంటగా గంజాయి సాగు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రొహిబిషన్ అబ్కారీ టాస్క్‌ఫోర్స్ సీఐ సాయన్న ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రతన్ సింగ్ సాగు భూమిలో 267 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.