కెనరా బ్యాంక్ నికర లాభం 24 శాతం వృద్ధి

by Harish |
కెనరా బ్యాంక్ నికర లాభం 24 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ కెరనా బ్యాంక్ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి నికర లాభం 23.5 శాతం పెరిగి రూ. 406.24 కోట్లుగా నమోదైనట్టు బ్యాంకు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ. 329.07 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020, ఏప్రిల్ 1 నుంచి సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులో విలీనం చేసిన తర్వాత రెండు బ్యాంకులను కలిపిన ఫలితాలు కావు, స్వతంత్రంగా ఉన్న ఆర్థిక ఫలితాలని బ్యాంకు వెల్లడించింది.

ఇక, సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 20,685.91 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 14,062.39 కోట్లతో పోలిస్తే ఈసారి పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, జూన్ 30 నాటికి బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 8.84 శాతంగా ఉన్నాయని, గతేడాది ఇదే త్రైమాసికంలో ఎన్‌పీఏలు 8.77 శాతమేనని పేర్కొంది. విలువ పరంగా ఎన్‌పీఏలు రూ. 57,525.52 కోట్లని బ్యాంక్ వివరించింది. అలాగే, నికర ఎన్‌పీఏలు 5.35 శాతం నుంచి 3.95 శాతంగా తగ్గినట్టు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed