- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్ నుంచి కెనడాకు 5 లక్షల కరోనా డోస్‌లు
దిశ వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. మరోసారి కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా కరోనా కేసులు పెరుగిపోతుండటంతో… వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో.. ఇప్పటికే పలు దేశాల్లో లాక్‌డౌన్ విధించగా.. ఇండియాలో కూడా పలు ప్రాంతాల్లో మరోసారి లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంచితే.. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచదేశాలకు ఇండియా అండగా నిలుస్తోంది. విదేశాలకు కూడా వ్యాక్సిన్లు అందిస్తూ ఆపదలో ఆదుకుంటోంది. ఇటీవలే పలు దేశాలకు ఇండియా వ్యాక్సిన్లు పంపించగా.. తాజాగా కెనడాకు ఇండియా వ్యాక్సిన్లు పంపించింది. 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను కెనడాకు ఇండియా పంపింది. ఈ మేరకు ఇండియా నుంచి 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోస్‌లు అందుకున్నట్లు కెనడా ప్రజా సేవలు, సేకరణ మంత్రి అనితా ఆనంద్ పేర్కొన్నారు.
ఈ వ్యాక్సిన్ డోస్‌లను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరిన్ని డోస్‌లను ఇవ్వనుందని అనితా ఆనంద్ తెలిపారు. భవిష్యత్‌లో ఇండియాతో తమ అనుబంధం కొనసాగుతుందని ఆయన చెప్పారు.
కాగా, ప్రస్తుతం ఇండియాలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. తొలి దశలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వగా.. రెండో దశలో భాగంగా ప్రస్తుతం 70 ఏళ్లు దాటిన వారితో పాటు 50 ఏళ్లు దాటిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్ డోస్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ వ్యాక్సిన్ తీసుకున్నారు.