- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఓవరాక్షన్‌పై హైకోర్టు సీరియస్.. ఎన్నికలు వాయిదా..?
చెన్నై : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓటర్ల ఆధార్ డేటాను బీజేపీ దుర్వినియోగం చేసి ప్రలోభాలకు పాల్పడుతున్నదన్న పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయవచ్చునా? అని ఎన్నికల సంఘాన్ని అడిగింది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఈసీకి ఉందని, కాబట్టి ఈ దర్యాప్తును పూర్తి చేయాలని, ఈ నెలాఖరుకు కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
బీజేపీ త్వరలోనే తమ అభిప్రాయాన్ని కోర్టులో సమర్పిస్తామని తెలిపింది. ఆధార్‌ను ఉపయోగించుకుని బీజేపీ పౌరుల వ్యక్తిగత సమచారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని, ఓటర్ల మొబైల్ నెంబర్లు కనుక్కుని ఆయా నియోజకవర్గాలకు అనుగుణంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నదని డీవైఎఫ్ఐ లీడర్ ఏ ఆనంద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తద్వారా వాట్సాప్ ద్వారా క్యాంపెయిన్ చేస్తున్నదని తెలిపారు.
గూగుల్ పే, పేటీఎంలు ఆధార్‌తో అనుసంధానమై ఉండటం వల్ల ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులూ సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసే ముప్పు ఉన్నదని వివరించారు. ఈ పిటిషన్‌ను సీజే సంజీబ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామ్మూర్తిల ధర్మాసనం విచారిస్తూ ఈసీ అప్రమత్తంగా ఉండాలని, దోషులు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఈ కేసు దర్యాప్తు సైబర్ క్రైమ్‌దని చేతులు దులుపుకోకూడదని పేర్కొంది. ఈ కేసు సీరియస్‌నెస్‌ను బట్టి ప్రాధాన్యతనిచ్చి చర్యలకు ఉపక్రమించాలని వివరించింది. ఏప్రిల్ 6న పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.