- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రుని మీద ఆవాసం సాధ్యమే!
దిశ, వెబ్‌డెస్క్: అంతరిక్షంలో.. ప్రధానంగా చంద్రుని మీద నివాసం ఏర్పరచుకోవడమే లక్ష్యంగా అనేక అంతరిక్ష సంస్థలు ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమి వెలుపల ఉన్న కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో మానవులు మనుగడ సాగించగలరా? అన్న ప్రశ్న అందరి మైండ్‌లోనూ మెదులుతోంది. ఈ ప్రయోగాల్లో సాధిస్తున్న పురోగతి కారణంగా మరికొన్ని సంవత్సరాల్లో మానవుడు తప్పకుండా అంతరిక్షంలో పాగా వేయగలడని ఖగోళ నిపుణులు భావిస్తుండగా, ‘గ్రీన్ ల్యాండ్స్’లో నిర్వహించిన ఓ కొత్త పరిశోధన ఇది సాధ్యమనేనని రుజువు చేస్తోంది.
డెన్మార్క్‌కు చెందిన ‘కార్ల్ జోహన్ సొరెన్సన్, సెబాస్టియన్ అరిస్టోటెలిస్’ అనే ఇద్దరు స్పేస్ ఆర్కిటెక్ట్స్.. ‘కొలాప్సబుల్ షెల్టర్’లో రెండు నెలలు గడిపి చంద్రుని మీద మానవ మనుగడ సాధ్యమే అని నిరూపించారు. ‘లూనార్క్’ పేరుగల ఈ షెల్టర్‌ను ‘సాగా స్పేస్ అర్కిటెక్ట్’ అనే డిజైన్ ఫర్మ్ రూపొందించింది. రాకెట్‌లో ఈజీగా ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు అనువుగా, చాలా తక్కువ స్పేస్‌ను ఆక్రమించే విధంగా దీన్ని తయారుచేశారు. 1700కిలోల బరువుండే ఈ ఫోల్డబుల్ షెల్టర్ కేవలం 102 క్యూబిక్ అడుగుల స్థలాన్ని మాత్రమే ఆక్రమిస్తుంది.
అంతేకాదు లునార్క్‌ను 607 క్యూబిక్ అడుగుల వరకు ఎక్స్‌పాండ్ చేయొచ్చు. ఇందులో ఫర్నిచర్, ఫుడ్, ఇతర రిసోర్స్ అన్నీ ఉన్నాయి. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 30 వరకు 60 రోజుల పాటు వీరిద్దరూ కాఫీ, కోల్డ్ ప్రొటీన్ షేక్స్, వేడి సూప్ (పొడి పదార్థాల నుంచి), అలాగే ప్రొటీన్ బార్‌లను ఆహారంగా స్వీకరించగా.. గ్రీన్‌లాండ్ మంచును కరిగించి నీళ్లు తాగారు. గ్రీన్‌లాండ్ ద్వీపానికి ఉత్తరాన -28° F (-16 ° C) పరిస్థితుల మధ్య ‘లూనార్క్’ షెల్టర్‌లో ఈ ఐసోలేషన్ ప్రయోగాన్ని నిర్వహించగా, అక్కడి వన్యప్రాణులతో ఏదైనా ప్రమాదకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉండటంతో వారిద్దరూ రెండు శాటిలైట్ ఫోన్స్, రైఫిళ్లను కూడా వెంట తీసుకెళ్లారు. ప్రయోగంలో భాగంగా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ సౌకర్యాలేవీ ఉపయోగించలేదు.
స్పెషలిస్ట్ ఆస్ట్రోనాట్ లేదా సైనిక శిక్షణ తీసుకోని సాధారణ ప్రజలు అలాంటి ఆవాసాలలో జీవించగలరా? లేదా? అన్నది తెలుసుకోవడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం కాగా, ఆ ఇద్దరూ విజయవంతంగా అందులో గడిపి చంద్రుని మీద కూడా మానవ మనుగడ సాధ్యమేనన్న ఆశలకు ఊపిరిపోశారు. కాగా ఈ ప్రయోగం ‘స్పేస్ టూరిజం’కు పునాదిగా నిలుస్తుందని ఖగోళ నిపుణులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ అంతరిక్ష పర్యాటకులు, వ్యోమగాములకు ఆశ్రయాలను నిర్మించాలని భావిస్తున్న అనేక సంస్థలలో ‘సాగా స్పేస్ ఆర్కిటెక్ట్స్’ ఒకటి. ప్రస్తుతం ‘లూనార్క్’ పనితీరు ఆధారంగా, చంద్రుని ఉపరితలం మీద ప్రత్యేకంగా నిర్మించే షెల్టర్స్ కోసం మరికొంత మార్పులు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇక భూమిపై చంద్రుడిలాంటి ప్రదేశాలలో ‘గ్రీన్‌ల్యాండ్’ ఒకటి కాగా, దాన్నే ప్రయోగప్రాంతంగా ఎంచుకుంది.