- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాగర్ లో ప్రశాంతంగా ఉపఎన్నిక..
దిశ నాగార్జునసాగర్ : నాగార్జున సాగర్ లో అసెంబ్లీ నియోజవర్గానికి ఉపఎన్నికకు ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పోలింగ్ సమయాన్ని రెండు గంటలపాటు పొడిగించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది బరిలో నిలిచారు. కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలు ఉన్నారు.
మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ తెరాస నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బిజెపి నుంచి రవికుమార్ రంగంలో ఉన్నారు. వచ్చే నెల 2న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జున సాగర్‌లో పర్యటించారు. పైలాన్‌కాలనీ, హిల్‌కాలనీలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సరళిని శశాంక్ గోయల్ పరిశీలన చేశారు.