- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదానీ గ్రూప్ చేతికి మరో మూడు ఎయిర్‌పోర్టులు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో జైపూర్, తిరవనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇవ్వడానికి కేంద్రం అనుమతించింది. వీటి అభివృద్ధి కోసం అదానీ గ్రూపును ఎంపిక చేసింది. ఇప్పటికే మంగళూరు, అహ్మదాబాద్, లక్నో ఎయిర్‌పోర్టులను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. తాజాగా మరో మూడు ఎయిర్‌పోర్టులను ప్రభుత్వం ఈ కంపెనీ చేతికి ఇచ్చింది.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన విమానాశ్రయాలను అదానీ గ్రూపునకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 1,070 కోట్ల ఆదాయం సమకూరుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ రాబోయే ఈ ఆదాయంతో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించనుంది. అలాగే, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించనున్నట్టు తెలుస్తోంది.
ఈ విమానాశ్రయాలను 50 సంవత్సరాల పాటు నిర్వహించే హక్కు అదానీ గ్రూపునకు ఉండనుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ నిర్వహించిన ఈ బిడ్డింగ్‌లో అదానీ గ్రూప్ విజయవంతంగా మూడు విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి కోసం లీజుకు ఇచ్చినట్టు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం రంగంలో పెట్టుబడులను ఉపయోగించి సేవలను, నైపుణ్యం, సామర్థ్యాలను పెంచుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.