- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శత్రువులకు గట్టి హెచ్చరికలు
న్యూఢిల్లీ : లడాఖ్ సరిహద్దులో స్వల్ప సమయంలో అనూహ్య వేగంతో చేపట్టిన వైమానిక దళ మోహరింపులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసిస్తూ, ఈ మోహరింపులు, బాలాకోట్ మెరుపు దాడులు శత్రువులకు తప్పకుండా గట్టి హెచ్చరికలను చేరవేస్తాయని అన్నారు. దేశ భూభాగాలను ఎట్టిపరిస్థితుల్లో రక్షించుకోవడానికి కట్టుబడి ఉన్నామని, ప్రజలందరూ ఈ విషయంపై రక్షక బలాలను నమ్ముతున్నాయని ఐఏఎఫ్ టాప్ కమాండర్లతో మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో చెప్పారు. అలాగే, భారత్, చైనా బలగాల ఉపసంహరణనూ ఈ సదస్సులో ప్రస్తావించారు. రాఫేల్ యుద్ధ విమానాల మోహరింపుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
లడాక్ సెక్టార్‌లో రాఫేల్ యుద్ధ విమానాల మోహరింపుపైనా టాప్ అధికారులు రివ్యూ చేపట్టనున్నారు. ఈ నెల చివరికల్లా రాఫేల్ యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్‌లో చేరనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో లడాఖ్ సెక్టార్‌కు తొలి బ్యాచ్‌లో రానున్న ఆరు రాఫేల్ ఫైటర్ జెట్లను తరలించనున్నట్టు తెలుస్తున్నది. ఈ సదస్సులో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా మాట్లాడుతూ.. సరిహద్దులో ఎటువంటి అవాంఛనీయ, ఆకస్మిక ఘటనలు జరిగిన ఎదుర్కొనడానికి బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు.