చైనా మాస్టర్స్ టోర్నీ రద్దు

by  |
చైనా మాస్టర్స్ టోర్నీ రద్దు
X

దిశ, స్పోర్ట్స్: చైనా మాస్టర్స్, డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్‌లను రద్దు చేస్తున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించింది. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ సూపర్ 100 టోర్నమెంట్‌లో భాగమైన లింగ్‌షుయ్ చైనా మాస్టర్స్ 2020, యోనెక్స్ డచ్ ఓపెన్ 2020ని రద్దు చేస్తున్నట్లు గవర్నింగ్ బాడీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు చైనా మాస్టర్స్ జరగాలి. కానీ, రెండుసార్లు ఈ టోర్నీని వాయిదా వేశారు. ఈ టోర్నీని ఆగస్టు 25 తర్వాత కూడా నిర్వహించడం సాధ్యపడదని తేలడంతో ఏకంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు అక్టోబర్ 6 నుంచి 11 వరకు నెదర్లాండ్స్‌లో జరగాల్సిన డచ్ ఓపెన్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ అంతర్జాతీయ కమిటీ స్పష్టం చేసింది. అయితే, గత మార్చి నుంచే బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌ను నిలిపేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పింది.


Next Story

Most Viewed