- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మారుతీ సుజుకి 'బై నౌ-పే లేటర్' ఆఫర్!
దిశ, సెంట్రల్ డెస్క్ :
దేశీయ అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తాజాగా సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించింది. ఈ స్కీమ్ కోసం మారుతీ సుజుకీ..కోరమండల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీతో జతకట్టింది. ‘బై నౌ..పే లేటర్’ ఆఫర్‌ను ద్వారా సులభంగా రుణం పొందవచ్చని మారుతీ సుజుకీ ఇండియా పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో మారుతీ సుజుకీ కార్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రెండు నెలల మారటోరియం సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు చెప్పింది. వినియోగదారులు ఇప్పుడు లోన్ తీసుకుంటే 60 రోజుల తర్వాత ఈఎమ్ఐ చెల్లించే సదుపాయం కల్పించింది. ఈ లోన్ మారటోరియం అనేది ఎంపిక చేసిన కార్ల మోడళ్లకు మాత్రమే వర్తిస్తుందని మారుతీ సుజుకీ షరతు విధించింది. జూన్ 30 వరకు తీసుకునే రుణాలకు ఇది వర్తిస్తుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ స్పష్టంచేశారు.కరోనా ప్రతికూల పరిస్థితుల్లో లిక్విడిటీ ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఈ స్కీమ్‌తో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.