బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డు

by Shyam |
బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డు
X

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రంలోని పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో సునామీ సృష్టించిన ‘సామజవరగమన, రాములో రాములా, బుట్ట బొమ్మ’ పాటలు వేటికవే రికార్డులు కొల్లగొట్టాయి. ఇక బుట్టబొమ్మ పాటలో పూజ అందాలకు, అల్లు అర్జున్ స్టెప్పులకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవల ఈ సాంగ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా చిందులేసి.. పాటకు మరింత క్రేజ్ తీసుకొచ్చారు. తాజాగా బుట్టబొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుని మరో రికార్డు సృష్టించింది.

బుట్ట బొమ్మ పాట విడుదలైన నాటి నుంచే ఏదో ఒక విధంగా నెటిజన్లకు చేరువవుతూనే ఉంది. ఫిబ్ర‌వరిలో బుట్ట‌బొమ్మ సాంగ్‌ని యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ప్ర‌స్తుతం ఈ సాంగ్ 200 మిలియ‌న్స్‌‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టి స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. ‘వరల్డ్ వైడ్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన 100 వీడియో సాంగ్స్‌లో ఈ పాట 15వ స్థానంలో నిలిచిందని థ‌మ‌న్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడగా.. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. కాగా రానున్న రోజుల్లో ఈ సాంగ్ మ‌రిన్ని రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంటుంద‌ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story