వ్యాపారి కిడ్నాప్ మిస్టరీ వీడింది..!

by Sumithra |
వ్యాపారి కిడ్నాప్ మిస్టరీ వీడింది..!
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా వస్త్ర వ్యాపారి కిడ్నాప్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి కీలక విషయాలు రాబట్టడంతోపాటు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

నల్లజర్ల లో గత నెల 30న వ్యాపారి రామకృష్ణను నేరస్థులు కిడ్నాప్ చేశారు. రామకృష్ణ నుంచి నగదు, బంగారం లాక్కొని గుంటూరు బైపాస్ రోడ్డులో టోల్ ప్లాజా దగ్గర అతనిని వదిలి వెళ్లారు. ఈ కేసులో ఏడుగురు కిడ్నాపర్ల ను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుండి రూ.80,వేలు, 28 గ్రాముల బంగారం, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story