రూ.23.26 కోట్ల జీఎస్‌టీ నోటీసులు అందుకున్న జొమాటో

by Harish |   ( Updated:2024-03-31 09:34:21.0  )
రూ.23.26 కోట్ల జీఎస్‌టీ నోటీసులు అందుకున్న జొమాటో
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో‌కు షాక్ తగిలింది. కర్ణాటక ట్యాక్స్ అధికారుల నుండి 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 23.26 కోట్ల విలువైన జీఎస్‌టీ నోటీసులను అందుకుంది. ఈ విషయాన్ని జొమాటో ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కర్ణాటకలోని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్ నుంచి ఈ ఆర్డర్‌ను పొందింది. రూ.11 కొట్లకు పైగా మొత్తం అమౌంట్‌కు వడ్డీ, పెనాల్టీ కలిపి రూ.23.26 కోట్లను జోమాటో చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే షోకాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా సంబంధిత పత్రాలతో వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ తెలిపింది. మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. న్యాయపరంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని జోమాటో అధికారులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో కూడా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 4 కోట్లకు పైగా జీఎస్‌టీకి వడ్డీ, ఇతర పెనాల్టీ కలిపి దాదాపు రూ.8 కోట్లకు పైగా చెల్లించాలని గుజరాత్ రాష్ట్ర పన్ను డిప్యూటీ కమిషనర్ నుంచి జొమాటో నోటీసులు అందుకుంది.

Advertisement

Next Story

Most Viewed