- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన సోనీ-జీ ఒప్పందం
దిశ, బిజినెస్ బ్యూరో: భారత మీడియా రంగంలో కీలక 'జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జెడ్‌ఈఈఎల్), సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)' మధ్య విలీన ఒప్పందం రద్దయింది. రెండేళ్లుగా మీడియా రంగంలో ఎంతో ఉత్కంఠత రేపిన ఈ డీల్ గడువు ముగిసిన కారణంగా విరమించుకుంటున్నట్టు సోనీ గ్రూప్ లేఖ పంపిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. దీంతో సోనీ తన ఇండియా యూనిట్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య జరిగిన 10 బిలియన్ డాలర్ల ఒప్పందం ఇంతటితో ముగిసింది. ఈ విషయాన్ని సోనీ భారత ఎక్స్ఛేంజ్‌కు సైతం తెలియజేసినట్టు సమాచారం. విలీన ఒప్పందంలో షరతులు నెరవేరకపోవడమే ఈ డీల్ రద్దవడానికి ప్రధాన కారణం. జీ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ పునీత్ గొయెంకాపై సెబీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో విలీన సంస్థకు నాయకత్వం వహిస్తారా లేదా అనే అంశంపై ఇరు కంపెనీల మధ్య సందేహాలు నెలకొన్నాయి. ఇది కూడా ఈ ఒప్పందం ముగిసేందుకు కారణమైంది. గడిచిన రెండేళ్ల నుంచి ప్రపంచ దిగ్గజాలైన అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లకు సోనీ-జీ విలీన సంస్థ గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావించాయి. కానీ, అది నెరవేరలేదు. గతేడాది డిసెంబర్ ఆఖరునాటికి ఒప్పంద గడువుపై ఇరు వర్గాలు పొడిగించిన 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఈ నెల 20తో ముగిసింది.