- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండు కొత్త స్కూటర్లు అందుబాటులోకి తెచ్చిన యులు, బజాజ్ ఆటో!
బెంగళూరు: ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ యులు, దేశీయ ద్విచక్ర తయారీ దిగ్గజం బజాజ్ ఆటో సంయుక్త ఈవీ స్కూటర్లను సోమవారం మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. అద్దెకు రోజువారీ వినియోగంతో పాటు డెలివరీ సేవల కోసం కూడా ఉపయోగపడేలా ఈ స్కూటర్లను రూపొందించామని, దేశీయ వినియోగదారుల అవసరాలు, రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని ఇరు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి.
మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్ పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త ఈవీ స్కూటర్లు స్వాపింగ్ బ్యాటరీలతో పని చేస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా యుమా ఎనర్జీ స్టేషన్లను నెలకొల్పామని, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 100 వరకు స్టేషన్లను ఏర్పాటు చేశామని యులు తెలిపింది. వచ్చే ఏడాది ఆఖరు నాటికి ఈ సంఖ్యను 500 స్టేషన్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని, వాహన అవసరాలు, ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకుని బాజజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యులు సీఈఓ అమిత్ గుప్తా చెప్పారు.
తమ వాహనాలు కావాల్సిన వినియోగదారులు సమీపంలో యులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని అద్దెకు తీసుకోవచ్చు, అనంతరం దగ్గర్లోని యులు సెంటర్లలో అప్పగించవచ్చని కంపెనీ వివరించింది.